![]() |
మరి కొన్ని శాండ్విచ్ రుచులు |
కావలసిన పదార్థాలు
* కీమా - పావుకిలో
* బ్రెడ్ - ఎనిమిది ముక్కలు
* ఎండు కారం - రెండు టీ స్పూన్లు
* కాజు పేస్ట్ - రెండు టీ స్పూన్లు
* నూనె - రెండు టేబుల్ స్పూన్లు
* అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్లు
* ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
* టమాటాలు - రెండు టేబుల్ స్పూన్లు
* పచ్చిమిర్చి - మూడు
* కరివేపాకు - ఒక రెబ్బ
* కొత్తిమీర - ఒక కట్ట
* షాజీరా - కొద్దిగా
* గరంమాసాలా - ఒక టీ స్పూను
* పసుపు - తగినంత
* ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం
కుక్కర్లో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత వెల్లుల్లి పేస్టు, షాజీరా కూడా వేయాలి. ఇప్పుడు కీమా వేసి నీరు పోయేంత వరకూ ఉడికించాలి. ఇందులో ఎండుకారం, పసుపు, ఉప్పు, టమోటాలు, కొత్తిమీర, కాజుపేస్ట్ వేసి బాగా కలపాలి.
కొద్దిగా నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత గరంమసాలా కూడా వేసి దించేయాలి. ఇది చల్లారిన తర్వాత బ్రెడ్‌పై అప్లయి చేసి పైన మరో బ్రెడ్‌తో మూసేయాలి.
దీన్ని పైనంపై కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. గార్నిష్ కోసం క్యారెట్, కీరా, కొత్తమీరతో అలంకరించుకోవాలి.
No comments:
Post a Comment