![]() |
మరి కొన్ని శాండ్విచ్ రుచులు |
కావలసిన పదార్థాలు
* బ్రెడ్ స్లైస్ - 8
* మష్రూమ్స్ (తరిగి) - 250 గ్రాములు
* వెన్న - ఒక కప్పు
* పచ్చిమిరపకాయలు (తరిగి) - 3
* కరివేపాకు - 1 రెబ్బ (చిన్నగా తరిగి)
* ఆలివ్ నూనె - 2 టేబుల్ స్పూన్లు
* మిరియాల పొడి - 1 టీస్పూన్
* ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం
పాన్‌లో రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడెక్కిన నూనెలో తరిగిన మష్రూమ్స్ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి.
.తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి స్టవ్ నుంచి దింపాలి.
రెండు బ్రెడ్ ముక్కలు తీసుకుని వాటికి ఒకవైపు వెన్న రాసి రెండు టేబుల్ స్పూన్ల మష్రూమ్ స్టఫ్‌ను దానిపై ఉంచాలి.
రెండో బ్రెడ్ ముక్కతో మష్రూమ్ స్టఫ్ పెట్టిన బ్రెడ్‌ను మూసేయాలి. యమ్మీ శాండ్‌విచ్ రెడీ.
No comments:
Post a Comment