![]() |
మరి కొన్ని శాండ్విచ్ రుచులు |
కావలసిన పదార్థాలు
*పావ్ బాజీ బన్స్ - 4
* నేతిబీరకాయ - 1 (సన్నని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేయాలి)
* ఉల్లి తరుగు - అర కప్పు
* పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను
* కొబ్బరి తురుము - 1 కప్పు
* పసుపు - చిటికెడు
* తాలింపు దినుసులు - తగినన్ని
* పెసర మొలకలు - అరకప్పు
* వేరుశనగ నూనె - 2 టీ స్పూన్లు
* (పెప్పర్
* సాల్ట్‌తో వేసిన) ఎగ్‌వైట్ ఆమ్లెట్ - రెండు ముక్కలు
తయారుచేయు విధానం
నూనెలో తాలింపు వేశాక ఉల్లి, మిర్చి, నేతిబీర తరుగు వేగించాలి.
. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించి పసుపు, ఉప్పు, కొబ్బరి తురుము కలిపి మరికొంత సేపు ఉంచి దించేముందు పెసర మొలకలు కలిపి దించేయాలి.
బన్స్ లోపల కొంత భాగం తీసేసి, పెనంపై రెండు వైపులా కొద్ది క్షణాలు కాల్చి నేతిబీర మిశ్రమం కూరి ముక్కల మధ్యలో ఆమ్లెట్ పెట్టి బర్గర్ తయారుచేసుకోవాలి. పిల్లలు బాగా ఇష్టపడే స్నాక్ ఇది
No comments:
Post a Comment