![]() ఆలూ, అన్నం టిక్కీ |
మరి కొన్ని వడ రుచులు |
మరి కొన్నిటిఫిన్ వడ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* ఎరుపు
* పసుపు
* ఆకుపచ్చ క్యాప్సికం - రెండు
* ఉడికించిన ఆలు - రెండు పెద్దవి
* కారం
* మిరియాలపొడి - అరచెంచా చొప్పున
* ఉప్పు - తగినంత
* పచ్చిమిర్చి - మూడు
* నూనె - అరకప్పు
* ఉల్లిపాయలు - రెండు
* ఉప్పు - తగినంత
* అన్నం - కప్పు
* కొత్తిమీర - కట్ట
* పెరుగు - అరకప్పు
* ఎండుమిర్చి - ఒకటి
తయారుచేయు విధానం
బాణలిని పొయ్యిమీద పెట్టి రెండు చెంచాల నూనె వేడిచేసి ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలూ, ఎండుమిర్చి ముక్కలూ మిరియాలపొడీ, కారం, తగినంత ఉప్పూ, పచ్చిమిర్చి తరుగూ వేసి వేయించాలి.
క్యాప్సికం ముక్కల్లోని పచ్చివాసన పోయాక వీటన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో అన్నం, ఉడికించిన ఆలూ, పెరుగూ, కొత్తిమీర తరుగూ వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని టిక్కీల్లా అద్దుకోవాలి. పొయ్యిమీద పెనంపెట్టి.. రెండు టిక్కీలను ఉంచి.. నూనె వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. ఇలాగే మిగిలినవీ చేసుకుంటే చాలు.
No comments:
Post a Comment