![]() |
మరి కొన్ని వడ రుచులు |
మరి కొన్నిటిఫిన్ వడ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*చికెన్ - 250 నుంచి 300 గ్రా
* తరిగిన ఉల్లిపాయలు - అరకప్పు
* పచ్చి మిర్చి - ఒకటి
* అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర కప్పు
* కారం
* గరంమసాలా - ఒకటిన్నర టీస్పూన్
* బియ్యప్పిండి - అరకప్పు
* శెనగపిండి - పావు కప్పు
* ఉప్పు - తగినంత
* నూనె - వేగించడానికి సరిపడా
* కొత్తిమీర
* పుదీనా - కొద్దిగా
* కోడిగుడ్డు - ఒకటి
* బ్రెడ్ పొడి - కొద్దిగా.
తయారుచేయు విధానం
ముందుగా చికెన్ ఉడికించాలి. చల్లారిన తరువాత బ్లెండర్‌లో వేసి మిక్సీ చేయాలి. అందులో ఉల్లిపాయలు, మిరపకాయ, గరంమసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమానికి కొద్ది కొద్దిగా పిండి చేర్చుతూ నీళ్లు చేర్చకుండానే కలపాలి. కలిపిన మిశ్రమంతో 8 నుంచి 9 పాటీలు చేయాలి.
వాటిని ముందు మైదాలో అద్ది, ఉప్పు చల్లి, చివరన కోడిగుడ్డు సొనలో అద్దాలి. వెంటనే బ్రెడ్ పొడిలో అద్దాలి. పావుగంట తరువాత నూనెలో వేగించాలి.
No comments:
Post a Comment