VTStyles

Recent Post

Friday, 1 July 2016

Bakery - Kulfi - Mango Kulfi / మ్యాంగో కుల్ఫీ

మ్యాంగో కుల్ఫీ


చిక్కనిపాలు - మూడు కప్పులు చక్కెర - మూడు టేబుల్‌స్పూన్లు కోవా - వంద గ్రా జీడిపప్పు పొడి - పావుకప్పు మ్యాంగో ఎమల్షన్‌ - రెండు టేబుల్‌స్పూన్లు (ఇది మామిడి రంగులో రుచిలో ఉండే ఎసెన్స్‌. బజార్లో దొరుకుతుంది) కుల్ఫీమౌల్డ్స్‌- రెండుమూడు.

  • ముందుగా పాలను బాగా మరిగించి అందులో కోవాను తురిమి వేయాలి. రెండు నిమిషాలయ్యాక చక్కెర వేయాలి. అది కరిగాక జీడిపప్పు పొడి వేసి బాగా కలిపి మంట తగ్గించాలి.

  • పాలు సగం అయ్యేవరకూ మరిగించి పొయ్యి కట్టేయాలి. పాలు బాగా చల్లారాక మ్యాంగో ఎమల్షన్‌ కూడా కలిపి ఓ నిమిషం మిక్సీ పట్టాలి.

  • తరవాత ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లోకి తీసుకుని మూతపెట్టేసి డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎనిమిది గంటలయ్యాక బయటకు తీస్తే మ్యాంగో కుల్ఫీ సిద్ధం.

No comments:

Post a Comment