రోజ్ కుల్ఫీ |
చిక్కనిపాలు- మూడు కప్పులు చక్కెర - మూడు టేబుల్‌స్పూన్లు బాదంపొడి - పావుకప్పు కోవా - వంద గ్రా రోజ్ సిరప్ - టేబుల్ స్పూను రూ అఫ్జా - టేబుల్ స్పూను (ఈ రెండూ బజార్లో దొరుకుతాయి).
పాలల్లో చక్కెర వేసి మరిగించాలి. తరవాత అందులో కోవా తురుము, బాదంపొడి వేసి బాగా కలిపి పాలు సగం అయ్యాక పొయ్యిమీద నుంచి దింపేయాలి.
అవి చల్లారాక రోజ్ సిరప్, రూ అఫ్జా వేసి బాగా కలిపి ఓసారి మిక్సీ పట్టాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని కుల్ఫీమౌల్డ్స్‌లోకి తీసుకుని ఎనిమిది గంటలపాటు డీప్ ఫ్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది.
No comments:
Post a Comment