VTStyles

Recent Post

Monday, 18 July 2016

Breakfast - Idly - Tomato Idly / టొమాటో ఇడ్లీ

టొమాటో ఇడ్లీ


టొమాటోలు - ఆరు మినప్పప్పు - గ్లాసు ఇడ్లీరవ్వ - రెండు గ్లాసులు ఉప్పు - తగినంత కిస్‌మిస్‌ - కొన్ని నూనె - రెండు చెంచాలు.

  • మూడు గంటల ముందుగా మినప్పప్పూ, ఇడ్లీరవ్వను విడివిడిగా నానబెట్టుకోవాలి. తరవాత మినప్పప్పును మెత్తగా, గట్టిగా రుబ్బుకుని అందులో ఇడ్లీరవ్వ, కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూతపెట్టేయాలి. ఈ పిండిని ఓ రాత్రంతా నాననివ్వాలి.

  • మర్నాడు టొమాటోల నుంచి రసం తీసి ఈ పిండిలో కలపాలి. అయితే పిండి మరీ పల్చగా లేకుండా చూసుకోవాలి.

  • ఇప్పుడు నూనె రాసిన ఇడ్లీప్లేట్లలో ఈ పిండిని వేసి పైన కిస్‌మిస్‌ చల్లి ఆవిరిమీద ఉడికించాలి. ఈ ఇడ్లీలు కొబ్బరిచట్నీతో బాగుంటాయి.

No comments:

Post a Comment