VTStyles

Recent Post

Saturday, 16 July 2016

Breakfast - Idly - Mango Ravva Idly /మ్యాంగో రవ్వ ఇడ్లీ

మ్యాంగో రవ్వ ఇడ్లీ


ఉప్మా రవ్వ - 1 కప్పు మామిడిపండ్ల గుజ్జు - 1 కప్పు పంచదార - 1 కప్పు నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు యాలకులపొడి - పావు టీ స్పూన్ ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు సార పప్పు - 1 టీ స్పూన్ లేదా జీడిపప్పు - 4

  • ముందుగా స్టౌ ఆన్ చేసి పెనం పెట్టి నెయ్యిని వేడి చేసుకోవాలి. అందులో రవ్వను కాస్త రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు ఆ రవ్వలో మామిడిపండ్ల గుజ్జును వేసి బాగా కలపాలి. తర్వాత అందులో పంచదార వేసి బాగా కలపాలి. ఆపైన కొబ్బరి తురుము, యాలకులపొడి వేసి పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులో పెట్టాలి. అలాగే ఓ గిన్నెలో నీళ్లు పోసి, ఈ ప్లేట్లను అందులో పెట్టి స్టౌపై పెట్టాలి.

  • ఏడెనిమిది నిమిషాల తర్వాత తీసి చూడండి.. నోరూరించే మ్యాంగో స్వీట్ ఇడ్లీ రెడీ. బయటికి తీసిన ఇడ్లీలపై సార పప్పు లేదా జీడిపప్పును పెట్టి గార్నిష్ చేసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్‌లో రెండు గంటలు పెట్టి పిల్లలకు సర్వ్ చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు.

No comments:

Post a Comment