VTStyles

Recent Post

Saturday, 9 July 2016

Breakfast - Steamed - Corn Cubes

కార్న్‌ క్యూబ్స్‌


మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్‌ కాదు)- 1/2 కప్పు రిఫైన్డ మొక్కజొన్న పిండి(కార్న్‌ఫ్లోర్‌)- 1 టీ స్పూను టోఫూ/పన్నీర్‌ తురుము- 1/2 కప్పు మిరియాల పొడి- 1/4 టీ స్పూను పచ్చిమిర్చి పేస్ట్‌- 1/4 టీ స్పూను పెరుగు- 1/4 కప్పు ఉప్పు- రుచికి సరిపడా సోయా సాస్‌- ఒకటిన్నర టీ స్పూను టొమేటా సాస్‌- 3 టీ స్పూన్లు చిల్లీ సాస్‌- 1 టీ స్పూను వెనిగర్‌- 1/2 టీ స్పూను నూనె- వేగించడానికి సరిపడా వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లి కాడల తరుగు- ఒక్కోటి 1/2 టీ స్పూను చొప్పున.

  • ఒక గిన్నెలో టోఫూ/ పన్నీర్‌ తురుము, మొక్కజొన్న పిండి, కార్న్‌ ఫ్లోర్‌, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్‌, పెరుగు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా పోసి చపాతి పిండిలా చేసుకోవాలి.

  • తరువాత దానిని ఒక పళ్ళెంలో సమానంగా సర్ది ఇడ్లీ ఉడికించినట్లుగా ఆవిరి మీద పావుగంట ఉడికించాలి. పదార్థం చల్లారిన తరువాత ముక్కలుగా కోయాలి.

  • తరువాత పెనం మీద నూనె వేసి ఆ ముక్కలను వేగించి పక్కనుంచాలి. ఆ తరువాత ఒక బాణలిలో టీ స్పూను నూనె వేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడలను ఒక నిమిషం పాటు వేగించుకోవాలి.

  • తరువాత సోయా సాస్‌, చిల్లీ సాస్‌, టొమేటా సాస్‌, వెనిగర్‌లను మూడు టీ స్పూన్ల నీళ్ళలో ఒక నిమిషం పాటు ఉడికించి దించేయాలి. వేగించుకున్న ముక్కలను ఈ సాస్‌ మిశ్రమంతో కలిపి వేడిగా తింటే బాగుంటుంది.

No comments:

Post a Comment