
సూఫ్లె
మరి కొన్ని ఆవిరి రుచులు |
కావలసిన పదార్థాలు
* బ్రెడ్‌పొడి - అరకప్పు
* వెన్న - పావుకప్పు
* మైదా - రెండు టేబుల్‌స్పూన్లు
* పాలు - కప్పు
* టొమాటో ముద్ద - మూడు టేబుల్‌స్పూన్లు
* పుదీనా తరుగు - టేబుల్‌స్పూను
* గుడ్లు - మూడు (తెల్ల
* పచ్చసొనల్ని విడివిడిగా తీసుకోవాలి)
* చీజ్ తురుము - గుప్పెడు
* ఉప్పు - కొద్దిగా
* ఉల్లిపాయ - ఒకటి.
తయారుచేయు విధానం
వెడల్పాటి గాజు పాత్రలో బ్రెడ్‌పొడి పరిచి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యి మీద పెట్టి వెన్న కరిగించాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. రెండు నిమిషాలయ్యాక మైదా వేసి వేయించి దింపేయాలి. ఇందులో పాలు పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
దీన్ని మళ్లీ సన్ననిమంటపై ఉంచాలి. మైదా ఉడికి చిక్కని సాస్‌లా తయారయ్యాక దింపేయాలి. ఇందులో టొమాటో ముద్ద, పుదీనా తరుగు, కొద్దిగా ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తరవాత గిలకొట్టిన పచ్చసొనను ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తరవాత తెల్లసొన వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్నంతా ముందుగా బ్రెడ్‌పొడి పరిచిన గాజుపాత్రలో పరిచి... పైన చీజ్ తురుము వేయాలి. ఈ పాత్రను ముందుగా వేడి చేసుకున్న ఓవెన్‌లో ఉంచి.. ఇరవై అయిదు నిమిషాలు బేక్ చేసుకుంటే చాలు. సూఫ్లె సిద్ధం. దీన్ని చిన్న కప్పుల్లోకి తీసుకుని తినొచ్చు.
No comments:
Post a Comment