
వెజ్ మోమోస్
మరి కొన్ని ఆవిరి రుచులు |
కావలసిన పదార్థాలు
* మైదా పిండి - 1 కప్పు
* తరిగిన కూరగాయలు - 2 కప్పులు (అర కప్పు క్యాబేజీ
* అర కప్పు బీన్స్
* అర కప్పు క్యారెట్
* అర కప్పు క్యాప్సికమ్)
* తరిగిన ఉల్లిపాయలు - 1 టేబుల్ స్పూన్
* అల్లం- వెలుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
* సోయా సాస్ - సరిపడా
* ఉప్పు - తగినంత
* నూనె - కావలసినంత
తయారుచేయు విధానం
ముందుగా మైదా పిండిలో చిటికెడు ఉప్పు, టీ స్పూన్ నూనె, నీళ్లు పోసి బాగా కలపాలి. అది చపాతీ పిండిలా అయ్యాక పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టౌపై ప్యాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలను వేయించాలి. ఆపైన మిగిలిన కూరగాయల ముక్కలను వేయాలి. అవి వేగుతున్నప్పుడే... ఉప్పు, సోయా సాస్ వేయాలి. మిశ్రమం దగ్గరికయ్యాక స్టౌ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకొని, చిన్న సైజు చపాతీల్లా చేసుకోవాలి. వాటి మధ్యలో కూరగాయల మిశ్రమాన్ని పెట్టి, ఫొటోల్లో కనిపిస్తున్న ఆకారం వచ్చేలా ఆ చపాతీ చివర్లను మడచాలి.
వీటిని ఇడ్లీల్లాగే ఆవిరి మీద ఉడికించాలి. ఈ మోమోస్‌ను ఏదైనా సాస్ లేదా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment