![]() టొమాటో ఢోక్లా |
మరి కొన్ని ఆవిరి రుచులు |
కావలసిన పదార్థాలు
*సెనగపిండి - కప్పు
* కొబ్బరి తురుము - పావుకప్పు
* ఆవాలు - అరచెంచా
* బొంబాయిరవ్వ - టేబుల్ స్పూను
* వంటసోడా - అరచెంచా
* ఉప్పు - తగినంత
* చక్కెర - అరచెంచా
* టొమాటోరసం - ముప్పావు కప్పు
* నూనె - టేబుల్‌స్పూను
* కొత్తిమీర తరుగు -కొద్దిగా.
తయారుచేయు విధానం
ఓ గిన్నెలో సెనగపిండి, బొంబాయిరవ్వ, ఉప్పు, వంటసోడా తీసుకుని బాగా కలపాలి. టొమాటోరసంలో చక్కెర కలిపి దాన్ని సెనగపిండిలో వేసుకుని మరోసారి కలపాలి.
వెడల్పాటి గిన్నె అడుగున కొద్దిగా నూనె రాసి ఇందులో ఈ పిండిని తీసుకుని ఆవిరిమీద ఉడికించుకోవాలి. పిండి ఉడికి గట్టి రొట్టెలా తయారవుతుంది.
దీన్ని ఓ పళ్లెంలోకి తీసుకుని ముక్కల్లా కోసుకోవాలి. బాణలిలో మిగిలిన నూనెను వేడిచేసి ఆవాలు వేయించి ఈ ముక్కలపై వేయాలి. చివరగా వడ్డించేముందు కొబ్బరి తురుమూ, కొత్తిమీర తరుగూ ఈ ముక్కలపై చల్లితే సరిపోతుంది.
No comments:
Post a Comment