![]() స్పినాచ్, పొటాటో పాన్‌కేక్ |
మరి కొన్ని రుచులు |
కావలసిన పదార్థాలు
*ఉడికించిన బంగాళాదుంపలు - రెండు
* బేకింగ్‌పౌడర్ - 15 గ్రా
* మైదా - 35 గ్రా
* పాలు - 25 ఎంఎల్
*
కోడిగుడ్లు - మూడు
* క్రీం - 120 ఎంఎల్
* ఉప్పు - రుచికి తగినంత
* నట్‌మగ్ - 5 గ్రా
* టమాటాసాస్ - పావుకప్పు
* పాలకూర - మూడుకట్టలు
* వెల్లుల్లి రెబ్బలు - మూడు చెంచాలు.
తయారుచేయు విధానం
దీని తయారీలో కోడిగుడ్లు లేదా క్రీం ఏదో ఒకటే వాడాలి. బంగాళాదుంపల్ని మెత్తగా చిదమాలి. అందులో క్రీం లేదా కోడిగుడ్ల సొన, మైదా, బేకింగ్‌పౌడర్, నట్‌మగ్, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్ పెనంపై చిన్నచిన్న రొట్టెల్లా కాల్చుకోవాలి. ఇప్పుడు పాలకూర, వెల్లుల్లిరెబ్బల్ని బాణలిలో మగ్గించాలి.
ఒక్కో రొట్టెపై పాలకూర మిశ్రమాన్ని పరిచి.. దానిపై మరో రొట్టెను ఉంచాలి. ఇలా రెండు మూడు అమర్చాక.. టమాటా సాస్ వేస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment