
క్యారెట్, కొత్తిమీర,సోంపు సూప్
మరి కొన్ని సూప్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*నాలుగు వందల గ్రాముల క్యారెట్ ముక్కలు
* అరకప్పు తరిగిన కొత్తిమీర
* రెండు టీస్పూన్ల చొప్పున సోంపు
* నూనె
* కొన్ని మిరియాలు
* ఒకటి తరిగిన ఉల్లిపాయ
* ఆరు కప్పుల నీళ్లు
* ఒక టీస్పూన్ మీగడ
* తగినంత ఉప్పు.
తయారుచేయు విధానం
ఒక గిన్నెలో నూనె పోసి మిరియాలు, సోంపు, ఉల్లిముక్కలు వేసి అవి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి.
తరువాత క్యారెట్ ముక్కలు వేసి నీళ్లు పోయాలి. క్యారెట్‌లు మెత్తగా అయ్యేవరకు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి.
చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, మీగడ వేసి బాగా కలిపి వేడి వేడిగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది.
No comments:
Post a Comment