ఫ్రిజ్ కేక్ |
ఆరెంజ్ జ్యూస్- 150 మిల్లీలీటర్ డైజస్టివ్ బిస్కట్లు డ్రైఫ్రూట్స్ (సన్నగా తరిగి)- రెండువందల గ్రాముల చొప్పున డార్క్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్- 150 గ్రాములు వెన్న- 120 గ్రాములు గోల్డెన్ సిరప్- ఒక టేబుల్‌స్పూను.
పాన్‌లో తరిగిన డ్రైఫ్రూట్స్, జ్యూస్ వేసి సన్నటి మంటపై నీరంతా ఆవిరయ్యే వరకు వేడి చేయాలి. తరువాత స్టవ్ ఆపేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి.
బిస్కట్లన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. బేకింగ్ గిన్నెకి వెన్న రాసి దానిలో బేకింగ్ పేపర్‌ని పరవాలి. వేరొక పాన్‌లో నీళ్లు మరిగించి దానిలో చాక్లెట్ వేసి పూర్తిగా కరిగాక స్టవ్ ఆపేయాలి.
మరొక గిన్నెలో వెన్న, గోల్డెన్ సిరప్ వేసి అది మెత్తగా అయ్యేవరకు చిలికి బాగా కలపాలి. దీనిలో చాక్లెట్‌తోపాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని బేకింగ్ గిన్నెలో వేసి కిందికి అదిమి దాన్ని ఎత్తుపల్లం లేకుండా సమానంగా పరవాలి. ఇది గట్టిగా అయ్యేదాక కొన్ని గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి.
అంతే...ఫ్రిజ్ కేక్ రెడీ...దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. (అవసరమనుకుంటే గుడ్డుతో కూడా తయారుచేసుకోవచ్చు)
No comments:
Post a Comment