VTStyles

Recent Post

Friday, 1 July 2016

Sweets - Burfi - NuvvulaBurfi / నువ్వుల బర్ఫీ

నువ్వుల బర్ఫీ


నువ్వులు - మూడు కప్పులు చక్కెర - రెండున్నర కప్పులు పల్లీలు - కప్పు ఎండుకొబ్బరితురుము - అరకప్పు జీడిపప్పు - కొద్దిగా నెయ్యి - రెండు చెంచాలు.

  • నువ్వులూ, పల్లీలను నూనె లేకుండా విడివిడిగా వేయించుకోవాలి. వాటి వేడి చల్లారాక నువ్వుల్ని పొడి చేసుకోవాలి. తరవాత పల్లీలను కూడా పొట్టు తీసేసి పొడిచేసుకోవాలి.

  • ఇప్పుడు మందపాటి గిన్నెలో పంచదార మునిగేవరకూ నీళ్లు పోసుకుని తీగపాకం వచ్చేవరకూ ఆగాలి. అప్పుడు ముందుగా చేసుకున్న పొడులతో పాటూ మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.

  • మధ్యమధ్య కొద్దిగా నెయ్యి వేస్తే మిశ్రమం అంటుకోకుండా వస్తుంది. అది దగ్గరపడ్డాక దింపేయాలి. దీన్ని నెయ్యిరాసిన పళ్లెంలోకి తీసుకుని చల్లారాక బిళ్లల్లా కోసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పు అద్దుకోవాలి.

No comments:

Post a Comment