ఆపిల్ గుమ్మడి హల్వా |
ఆపిల్: 500 గ్రా గుమ్మడి: 500 గ్రా పిస్తా పప్పులు: 100 గ్రా పాలపొడి: 150 గ్రా పంచదార: మూడు టేబుల్ స్పూన్లు యాలకల పొడి: రెండు టీ స్పూన్లు నెయ్యి: ఒక కప్పు
ఆపిల్, గుమ్మడికాయల తొక్క, గింజలను తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోయండి. అడుగు మందంగా ఉన్న బాండీలో నెయ్యి వేసి వేడెక్కాక ఈ ముక్కలను వేసి సన్నటి సెగమీద ఉడికించండి.
అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలి. ముక్కలన్నీ కలిసిపోయి మెత్తటి గుజ్జులా అయ్యాక సెగ పెంచి నాలుగైదు నిమిషాలు వేగించండి. ఆ తర్వాత సెగ తగ్గించి పాలపొడిని కలిపి మరో ఐదునిమిషాలు ఉడకనివ్వాలి.
పంచదార వేసి నీరు ఇగిరిపోయి, పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు ఉడికించాలి. చివరగా యాలకల పొడి, పిస్తా గింజల పొడి వేసి బాగా కలిపి వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా బాగుంటుంది.
No comments:
Post a Comment