![]() కోకోనట్ షీరా |
మరి కొన్ని హల్వా రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* కొబ్బరి క్రీమ్ - రెండున్నర కప్పులు
* చిక్కటి పాలు - 1 లీటరు
* చక్కెర - అర కప్పు
* యాలకుల పొడి - అర టీస్పూను
* జీడిపప్పు - పావు కప్పు
* నెయ్యి - తగినంత.
తయారుచేయు విధానం
జీడిపప్పును వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టి పక్కనుంచాలి. నాన్ స్టిక్ పాన్‌లో కోకోనట్ క్రీమ్, పాలు పోసి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి.
సగానికి తగ్గాక చక్కెర వేసి కలుపుతూ చిక్కబడేవరకూ ఉడికించాలి. యాలకులు, జీడిపప్పు కలిపి చల్లారనివ్వాలి. ఫ్రిజ్‌లో గంటపాటు ఉంచి సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment