పనస హల్వా |
పనస తొనలు - 10 పంచదార - మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు పాలు - ఒక కప్పు యాలకుల పొడి - ఒక టీస్పూను జీడిపప్పు ఎండుద్రాక్ష - తగినన్ని బాదం పలుకులు - రెండు టీస్పూన్లు.
పాన్‌లో నెయ్యి వేడిచేసి సన్నటి మంట మీద జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం పలుకులు వేగించాలి. వీటిని ప్లేట్‌లో వేసుకుని మిగిలిన నూనెలో పాలు, యాలకుల పొడి, చక్కెర వేసి కలపాలి.
ముక్కలు మెత్తగా ఉడికి హల్వా చిక్కబడేవరకూ సన్నటి మంట మీద కలుపుతూ ఉడికించాలి. నెయ్యి తేలేవరకూ ఉంచి చివర్లో జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం పలుకులు చల్లి తింటే యమ్మీగా ఉంటుంది.
No comments:
Post a Comment