మొక్కజొన్న హల్వా |
రిఫైన్డ మొక్కజొన్న పిండి(కార్న్‌ఫ్లోర్)- 1/2 కప్పు పంచదార- ఒకటిన్నర కప్పు నీళ్ళు- రెండున్నర కప్పులు నెయ్యి- 1 టేబుల్ స్పూను వేగించిన జీడిపప్పు ముక్కలు- 2 టీ స్పూన్లు యాలకుల పొడి- 1/2 టీ స్పూను మిఠాయి రంగు- చిటికెడు.
న్ స్టిక్ బాణలిలో ఒక కప్పు నీళ్ళు, పంచదార వేసి తీగపాకం రానివ్వాలి. తరువాత కార్న్‌ఫ్లోర్‌లో ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని పాకంలో పోసి బాగా కలిపి, సన్నని మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు, యాలకుల పొడి వేసి, మిఠాయి రంగును స్పూనుడు నీళ్ళలో కలిపి పోసి, గరిటెతో కలుపుతూ ఉడికించాలి.
పదార్థం బాణలి అంచులను వదులుతూ గరిటెకు చుట్టుకుపోతున్నప్పుడు మంట కట్టేసి, నెయ్యి రాసిన ప్లేటులోనికి తీసుకుని చల్లార్చి ముక్కలు కోయాలి.
No comments:
Post a Comment