
పాలకోవా బ్రెడ్ గులాబ్ జామ్
మరి కొన్ని జామున్ రుచులు |
మరి కొన్ని రసగుల్లా రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*జామ్ మిక్చర్ - 1 కప్పు
* (మిక్చర్‌లో కలపడానికి) నీరు - పావు కప్పు
* పంచదార - 1 కప్పు
* (పాకానికి) నీరు - 1 కప్పు
* యాలకులపొడి - చిటికెడు
* పాలకోవా - పావు కప్పు.
తయారుచేయు విధానం
మిక్చర్‌లో నీరు పోసి ఉండలు లేకుండా కలిపి పది నిమిషాలు పక్కనుంచాలి. పాలకోవాని చిదిమి పొడి చేయాలి.
మిక్చర్ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసి, పానీ పూరీ సైజులో ఒత్తి మధ్యలో అర టీ స్పూను కోవా పెట్టి (పగుళ్లు లేకుండా) గుండ్రంగా మడిచేయాలి.
తర్వాత నూనెలో సన్నని మంటపై దోరగా వేగించాలి. వీటిని పంచదార లేత పాకంలో వేసి గంటపాటు ఉంచాలి.
No comments:
Post a Comment