పనీర్ గులాబ్ జామ్
పనీర్ - 250 గ్రా. (తీపి లేని) కోవా - 200 గ్రా. మైదా - అరకప్పు బేకింగ్ పౌడర్ - చిటికెడు యాలకుల పొడి - 1 టీ స్పూను నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు నూనె - వేగించడానికి సరిపడా.
ఒక వెడల్పాటి పాత్రలో సన్నగా తురుముకున్న పనీర్, కోవా, నెయ్యి, మైదా, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపి ముద్ద చేసుకోవాలి.
తర్వాత నిమ్మకాయ సైజులో ఉండలు చేసి నూనెలో మాడిపోకుండా (లోపలి పదార్థం ఉడికేలా) దోరగా వేగించాలి.
ఈ లోపు మరో పొయ్యిమీద తయారు చేసుకున్న పంచదార పాకంలో యాలకుల పొడి కలిపి, వేగిన ఉండల్ని ఒక్కొక్కటిగా వేసి అరగంట సేపు (పాకం పీల్చుకునే వరకు) ఉంచి, సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment