ఆమ్ కీ ఖీర్ |
బాస్మతీ బియ్యం - కప్పు (గంట ముందు నానబెట్టుకోవాలి) చక్కెర - ఒకటిన్నర కప్పు పాలు - రెండులీటర్లు మామిడిపండ్లు పెద్దవి - నాలుగు గులాబీనీరు - రెండు చుక్కలు బాదం పిస్తా పలుకులు - రెండూ కలిపి పావుకప్పు కోవా - అరకప్పు.
మామిడిపండ్ల చెక్కు తీసి ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. అలాగే నానిన బియ్యాన్ని మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని పిండిలా చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు పాలను వేడిచేసి అందులో బియ్యప్పిండి వేసి మంట తగ్గించాలి. కాసేపటికి అది ఉడుకుతుంది. అప్పుడు చక్కెరా, కోవా వేసి బాగా కలపాలి.
ఇది చిక్కగా అయ్యాక మందుగా కోసి పెట్టుకున్న మామిడిపండు ముక్కలూ, గులాబీనీరూ వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.
చివరగా బాదం, పిస్తా పలుకులు వేసి వేడి చల్లారాక ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది చల్లగా తీసుకుంటేనే బాగుంటుంది.
No comments:
Post a Comment