సీతాఫల్ బాసుంది
పాలు (వెన్న తీసినవి) - లీటరున్నర సీతాఫలం గుజ్జు - ఒక కప్పు పంచదార - అరకప్పు యాలకుల పొడి - అర టీ స్పూన్ పిస్తా పలుకులు -10 -13 చిరంజి పలుకులు - ఒక టేబుల్ స్పూన్ బాదం పలుకులు(పొట్టు తీసి సన్నగా పొడవుగా తరిగినవి) - 10 - 12 గులాబీ రేకులు - 3-4
మందపాటి గిన్నెలో పాలు పోసి ఎక్కువ సెగ మీద కాచాలి. పొంగు వచ్చిన తరువాత సెగ తగ్గించి మరో అరగంట కాయాలి.
పాలు అడుగంటకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. పాలు సగమయ్యేంతవరకూ కాచి దానిలో పంచదార వేసి మరో ఐదునిముషాలు పొయ్యిమీదే ఉంచండి.
పాలు చల్లార్చాక దానిలో సీతాఫలం గుజ్జు, యాలకుల పొడి, తరిగిన పిస్తా, చిరంజి పలుకులను చేర్చాలి. వేరే గిన్నెలోకి తీసి బాదంపలుకులు, గులాబీ రేకులతో అలంకరిస్తే కళ్లకి విందుగానూ, నోటికి పసందుగానూ ఉంటుంది.
No comments:
Post a Comment