స్వీట్ కార్న్ పాయసం
కార్న్ - 1 పాలు - 2 టే.స్పూన్లు పాలు - 2 కప్పులు. యాలకుల పొడి - అర టీస్పూను నెయ్యి - అర టే.స్పూను పంచదార - 4 టే.స్పూన్లు పిస్తా జీడిపప్పు బాదం పప్పు - 1 టే.స్పూను కుంకుమ పువ్వు - చిటికెడు.
మిక్సీలో కార్న్ వేసి దానికి పాలు చేర్చి ముద్దలా చేసుకోవాలి. పాన్‌లో నెయ్యి వేడి చేసి ఈ ముద్దను అందులో వేసి నాలుగు నిమిషాలపాటు చిన్న మంట మీద వే యించాలి.
తర్వాత అందులో పాలు పోసి కలపాలి. పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కనుంచుకోవాలి. పాయసాన్ని చిన్న మంట మీద ఉంచి 8 నిమిషాలపాటు అడుగంటకుండా ఉడికించాలి. దీంట్లో చక్కెర కలపాలి.
పాయసం చిక్కబడేవరకూ ఉడికించి యాలకుల పొడి వేయాలి. చివర్లో జీడిపప్పు, బాదం, పిస్తా చల్లి సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment