
సగ్గుబియ్యం కిచిడీ
మరి కొన్ని రుచులు |
కావలసిన పదార్థాలు
*సగ్గుబియ్యం- ఒక కప్పు
* ఆలుగడ్డలు- రెండు
* వేగించిన పల్లీలు- అర కప్పు
* దంచిన అల్లం- ఒక టీ స్పూను
* జీలకర్ర- ఒక టీ స్పూను
* పచ్చిమిరపకాయలు- రెండు
* పచ్చి కొబ్బరి తురుము- పావు కప్పు
* నూనె- రెండు గరిటెలు
* చక్కెర- అర టీ స్పూను
* ఉప్పు- తగినంత.
తయారుచేయు విధానం
సగ్గుబియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డలను ఉడికించి, ముక్కలుగా కోసుకోవాలి.
పల్లీలను వేగించి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో చక్కెర, ఉప్పు, సగ్గుబియ్యం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర వేసి వేగించాలి.
తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం వేగాక, అల్లం తురుము కూడా వేసి వేగించాలి. బాగా వేగిన తర్వాత ఆలుగడ్డలు వేసి కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి.
తర్వాత సగ్గుబియ్యం వేసి కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి.
No comments:
Post a Comment