
మొలకల గారెలు
మరి కొన్ని వడ రుచులు |
మరి కొన్ని స్నాక్ వడ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*సెనగలూ
* బొబ్బర్లూ
* పెసల మొలకలు - అన్నీ కలిపి కప్పు
* అల్లం - చిన్న ముక్క
* పచ్చిమిర్చి - రెండు
* జీలకర్ర - చెంచా
* కరివేపాకు - రెండు రెబ్బలు
* బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు
* ఉప్పు - కొద్దిగా
* నూనె - వేయించేందుకు సరిపడా.
తయారుచేయు విధానం
పెసలూ, సెనగలూ, బొబ్బర్ల మొలకలను ముందే చేసుకోవాలి. ముందుగా ఓ రాత్రంతా పెసలూ, సెనగలూ, బొబ్బర్లను విడివిడిగా నానబెట్టుకోవాలి. మర్నాడు నీటిని వంపేసి వేర్వేరుగా పల్చని, కాటన్ బట్టల్లో మూట కట్టుకుంటే తరవాతి రోజుకు మొలకలు వస్తాయి.
ఇలా చేసుకున్న మొలకల్ని మిక్సీ జారులోకి వేసుకుని కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మరీ మెత్తగా కాకుండా రుబ్బుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
ఇందులో బియ్యప్పిండీ, కొద్దిగా ఉప్పూ, అల్లం, పచ్చిమిర్చీ, జీలకర్ర కలిపి చేసుకున్న పేస్టు వేసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. చివరగా కరివేపాకును సన్నగా తరిగి ఈ పిండిలో వేసి కలపాలి.
ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసుకుని ఈ పిండిని గారెల్లా కవరుపై తట్టుకుని అందులో వేసి వేయించుకుని తీసుకోవాలి.
No comments:
Post a Comment