
పచ్చిశనగల ఆమ్లెట్
మరి కొన్ని దోసె రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* పచ్చిశనగలు- ఒక కప్పు
* సన్నగా తరిగిన ఉల్లిపాయ
* టమోట- ఒక్కోటి చొప్పున
* సన్నగా తరిగిన కొత్తిమీర లేదా పాలకూర- ఒక కప్పు
* పసుపు- పావు టీ స్పూను
* కారం- రుచికి తగినంత
* ఉప్పు- తగినంత
* వెల్లుల్లి ముద్ద- ఒక టీ స్పూను
* లవంగం- ఒకటి
* నూనె- సరిపడా.
తయారుచేయు విధానం
శనగలను రెండు గంటల పాటు నానబెట్టి, లవంగం కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
దాంట్లో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి వేడెక్కాక నూనె రాసి, ఆ పిండితో ఆమ్లెట్లు వేసుకోవాలి. చిన్న మంట మీద రెండు వైపులా బాగా ఉడికేదాకా కాల్చాలి.
No comments:
Post a Comment