VTStyles

Recent Post

Friday, 26 August 2016

Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ

కోకమ్‌ కర్రీ


చేపముక్కలు - పావుకేజీ ఉల్లిపాయలు పెద్దవి - రెండు కారం - టేబుల్‌స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద- టేబుల్‌స్పూను లవంగాలు - నాలుగు పసుపు - అరచెంచా మెంతులు - అరచెంచా టొమాటోలు - రెండు ఉప్పు - తగినంత జీలకర్రపొడి ధనియాలపొడి - ఒకటిన్నర చెంచా నూనె - అరకప్పు కోకమ్‌ - పావుకప్పు (బజార్లో దొరుకుతుంది).

  • వెడల్పాటి బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక టొమాటో ముక్కలు వేయించాలి.

  • ఈ రెండూ ఉడికి గ్రేవీలా తయారయ్యాక అల్లం,వెల్లుల్లి ముద్ద, లవంగాలూ, మెంతిపొడి, కారం, పసుపు, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాలపొడి వేసి మంట తగ్గించేయాలి.

  • కాసేపటికి ఇది కూరలా తయారవుతుంది. అప్పుడు చేపముక్కలూ, కోకమ్‌ వేసి... మంట తగ్గించి మూత పెట్టేయాలి. చేప ముక్కలు ఉడికాక దింపేయాలి.

No comments:

Post a Comment