VTStyles

Recent Post

Friday, 26 August 2016

Curry - NonVeg - Mahi Khalia / మహి ఖలియా

మహి ఖలియా


చేపముక్కలు - పావుకేజీ నువ్వులు - టేబుల్‌స్పూను జీడిపప్పు - పదిహేను అల్లంవెల్లుల్లి ముద్ద - టేబుల్‌స్పూను కొబ్బరిపొడి - రెండు టేబుల్‌స్పూన్లు ఉల్లిపాయలు - రెండు పచ్చిమిర్చి - ఐదు చింతపండు రసం - టేబుల్‌స్పూను జీలకర్ర - రెండు చెంచాలు కరివేపాకు రెబ్బలు - రెండు ఆవాలు - చెంచా నూనె - పావుకప్పు గసగసాలు - చెంచా పసుపు - పావుచెంచా ఉప్పు - తగినంత.

  • గసగసాలూ, నువ్వులూ, జీడిపప్పూ, కొబ్బరి పొడి మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.

  • ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలూ, ఆవాలు వేయించాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.

  • అవి ఎరుపురంగులోకి వచ్చాక అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపూ, తగినంత ఉప్పూ, చింతపండు రసం వేయాలి. చింతపండు రసం ఉడికి, నూనె పైకి తేలాక చేపముక్కలూ, కాసిని నీళ్లు పోసి మంట తగ్గించేయాలి.

  • చేపముక్కలు పూర్తిగా ఉడికాక ముందుగా చేసుకున్న మసాలా వేసి.. బాగా కలపాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక దింపేయాలి.

No comments:

Post a Comment