
సోయా సూప్
మరి కొన్ని సూప్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*సోయాగింజలు - కప్పు (ముందురోజు రాత్రే నానబెట్టుకుని ఉడికించుకోవాలి)
* సన్నగా తరిగిన క్యారెట్
* బీన్స్ - పావుకప్పు చొప్పున
* స్వీట్‌కార్న్ - పావుకప్పు
* మొక్కజొన్న పిండి - అరచెంచా
* నీళ్లు - రెండు కప్పులు
* ఉప్పు - తగినంత
* పంచదార - అరచెంచా
* నూనె - చెంచా
* చిల్లీసాస్ - అరచెంచా
* వెనిగర్ - నాలుగైదు చుక్కలు
* ఉల్లికాడల తరుగు - అలంకరణకోసం.
తయారుచేయు విధానం
వెడల్పాటి బాణలిలో నూనె వేడిచేసి క్యారెట్, బీన్స్ ముక్కల్ని రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు స్వీట్‌కార్న్ చేర్చి మరో రెండు నిమిషాలు వేయించి నీళ్లు చేర్చాలి. అవి మరిగాక చిల్లీసాస్, వెనిగర్ వేయాలి.
తరవాత మొక్కజొన్న పిండిని చల్లని నీటిలో కలిపి చేర్చి తగినంత ఉప్పు వేసి మంట తగ్గించాలి. నీళ్లు మరోసారి మరిగాక సోయా గింజల్ని కూడా వేసి నిమిషమయ్యాక పంచదార కలపాలి.
కాసేపయ్యాక దింపేస్తే సరిపోతుంది. పైన ఉల్లికాడల తరుగుతో అలంకరిస్తే వేడివేడి సోయా సూప్ చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment