
లెంటిల్‌సూప్
మరి కొన్ని సూప్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*ఎర్ర కందిపప్పు - కప్పు
* ఉప్పు - రెండు టేబుల్‌స్పూన్లు
* కుంకుమపువ్వు - చిటికెడు
* తెల్ల ఉల్లిపాయ ముక్కలు -అరకప్పు
* ఆలివ్‌నూనె - రెండుటేబుల్‌స్పూన్లు
* జీలకర్ర-చెంచా
* సన్ననినూడుల్స్ - అరకప్పు (ప్రొటీన్ డైట్ తీసుకుంటుంటే మాత్రం వీటిని వేసుకోకపోవడమే మంచిది)
* నిమ్మకాయ - ఒకటి.
తయారుచేయు విధానం
ఓ పాత్రలో ఐదుకప్పుల నీళ్లు తీసుకుని ఉప్పు, ఆలివ్‌నూనె, కుంకుమపువ్వు, ఉల్లిపాయ ముక్కలు, ఎర్రకందిపప్పు వేయాలి. మంట ఎక్కువగానే ఉంచి.. పప్పును ఉడికించాలి.
. అది మెత్తగా అయ్యాక జీలకర్ర, నూడుల్స్ వేయాలి. మరో ఐదునిమిషాలు ఉంచి పొయ్యి కట్టేయాలి.
వడ్డించే ముందు నిమ్మరసం పిండితే చాలు. పసందైన లెంటిల్స్ సూప్ వేడివేడిగా తీసుకోవడమే ఆలస్యం.
No comments:
Post a Comment