
చికెన్ బ్రెడ్ రోల్స్
మరి కొన్ని రోల్స్ రుచులు |
కావలసిన పదార్థాలు
*చికెన్ ముక్కలు - పావు కిలో
* పసుపు - అర టీ స్పూన్
* ఉప్పు - తగినంత
* తరిగిన ఉల్లిపాయలు - 2 కప్పులు
* అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీ స్పూన్
* కారం - 1 టీ స్పూన్
* కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
* బ్రెడ్ ముక్కలు - 10
* కరివేపాకు రెబ్బలు -2
* గుడ్డు సొన - అర కప్పు
* పాలు - 1 కప్పు
* బ్రెడ్ పొడి - 1 కప్పు
* నూనె - సరిపడా
తయారుచేయు విధానం
ముందుగా చికెన్ ముక్కలను పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ పై ప్యాన్ పెట్టి నూనెను వేడి చేయాలి.
అందులో ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం పొడి, చికెన్ ముక్కలు వేయాలి. 5- 10 నిమిషాల తర్వాత దాంట్లో కొత్తిమీర తురుమును వేసి, స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
తర్వాత బ్రెడ్ ముక్కల చివర్లను తొలగించి, వాటిని పాలలో కాసేపు నానబెట్టాలి. ఆ బ్రెడ్ ముక్కల మధ్యలో చికెన్ స్టఫ్ పెట్టి రోల్ చేయాలి.
ఆపైన వాటిని గుడ్డు సొనలో ముంచాలి. తర్వాత బ్రెడ్ పొడిలో దొర్లించాక ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగంట ఆగాక బయటికి తీసి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వీటిని ఏదైనా సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment