VTStyles

Recent Post

Wednesday, 14 September 2016

Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌

పాప్‌కార్న్‌ మిక్స్చర్‌


పాప్‌కార్న్‌- రెండు కప్పులు బియ్యప్పిండి- ఒక కప్పు పల్లీలు- ఒక కప్పు జీడిపప్పు బాదం కలిసి- అర కప్పు నూనె- రెండు కప్పులు కారం- రెండు టీ స్పూన్లు ఉప్పు- తగినంత నెయ్యి- రెండు టీ స్పూన్లు జెమ్స్‌- అర కప్పు నీరు- తగినంత.

  • బియ్యంపిండిలో ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి, గట్టిగా కలుపుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి, వేడెక్కాక కలిపిపెట్టిన బియ్యంపిండితో సన్నటి మురుకులు వేసుకోవాలి.

  • మురుకులు తీసిన తర్వాత పల్లీలు, బాదం, జీడిపప్పు కూడా అదే నూనెలో వేగించాలి. తర్వాత నెయ్యిని కరిగించి పాప్‌కార్న్‌పై వేసి బాగా కలపాలి.

  • దీంట్లో వేగించిన పల్లీలు, బాదం, జీడిపప్పు వేసి కలపాలి. చివర్లో మురుకులను కూడా చేత్తో నలిపి ముక్కలు చేసి ఈ మిశ్రమానికి జతచేయాలి

  • చివర్లో జెమ్స్‌ కూడా వేయాలి. ఈ పాప్‌కార్న్‌ మిక్స్చర్‌ స్వీటు, హాట్‌ కలగలిపిన రుచితో కొత్తగా ఉంటుంది.

No comments:

Post a Comment