క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
బియ్యప్పిండి- రెండు కప్పులు క్యారట్ తురుము- పావు కప్పు పెసరపప్పు - పావు కప్పు జీలకర్ర- అర టీ స్పూన్ ఉప్పు- తగినంత నెయ్యి- 3 చెంచాలు
పెసరపప్పు కడిగి నీరు పోసి కొద్దిసేపు నానపెట్టి తర్వాత కాస్త పలుకుగా ఉడికించి జల్లెడ లేదా చిల్లుల పాత్రలో వేయాలి. బియ్యప్పిండిలో ఉప్పు, జీలకర్ర, క్యారట్ తురుము, పెసరపప్పు వేసి కలిపి నీళ్లు పోసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి.
మిశ్రమం మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని జారుడుగానూ ఉండకూడదు. పూరీ పిండిలా ఉండాలి.
ఈ పిండిని పెద్ద నిమ్మకాయంత ఉండలు చేసి ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి. ఇష్టమైతే కొబ్బరి తురుముతో గార్నిష్ చేయవచ్చు.
No comments:
Post a Comment