
కొబ్బరి కోజుకట్టై
మరి కొన్ని రుచులు |
కావలసిన పదార్థాలు
* పచ్చి కొబ్బరి తురుము- ఒక కప్పు
* బెల్లం తురుము- ముప్పావు కప్పు
* ఏలకుల పొడి- ఒక టీ స్పూన్
* బియ్యప్పిండి- ఒకటిన్నర కప్పులు
* కొబ్బరి నూనె- రెండు టీ స్పూన్లు
* ఉప్పు- చిటికెడు
తయారుచేయు విధానం
బెల్లం తురుములో కొద్దిగా నీరు పోసి మరిగించి ముదురు పాకం వచ్చిన తర్వాత కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. నీరు ఇగిరి పోయి ముద్దయిన తర్వాత ఏలకుల పొడి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత కొబ్బరి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు మరిగించాలి.
అందులో ఉప్పు, బియ్యప్పిండి వేసి కలుపుతూ దగ్గర అయ్యే వరకు సన్నమంట మీద ఉడికించాలి. ముద్దగా అయిన తర్వాత దించాలి. చల్లారిన తర్వాత పిండిని బాగా మర్దన చేసి మృదువుగా అయ్యాక నిమ్మకాయ సైజు ఉండలు చేసుకోవాలి.
చేతికి కొబ్బరి నూనె రాసుకుని ఉండను కొంచెం వెడల్పుగా చేసి మధ్యలో కొబ్బరి ఉండను పెట్టి అన్ని వైపుల నుంచి మూసేయాలి.
ఇలా పిండి మొత్తం చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో లేదా ప్రెషర్ కుకర్‌లో జల్లెడ వంటిది అమర్చి పైన కోజుకొట్టైలను పెట్టి ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి.
గమనిక: కొంత బియ్యప్పిండిలో కేసర్ రంగు కలిపి దానిని మిగిలిన బియ్యప్పిండిలో కలిపి ఉండలు చేసుకుంటే కొబ్బరి కోజుకొట్టైలలో రంగు చారలుగా కనిపిస్తూ అందంగా ఉంటుంది.
No comments:
Post a Comment