కొంకణి పాథోలి
బియ్యప్పిండి- ఒక కప్పు నీళ్లు- ఒక కప్పు ఉప్పు- చిటికెడు నెయ్యి- 3 స్పూన్లు తాజా కొబ్బరి తురుము- ఒక కప్పు బెల్లం తురుము- అర కప్పు ఏలకుల పొడి- ఒక టీ స్పూన్ పసుపు ఆకులు లేదా అరటి ఆకులు (పాథోలీ చుట్టడానికి)
ఒక గిన్నెలో నీరు పోసి ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి వేసి దించి ఉండలు కట్టకుండా కలిపి మూతపెట్టి ఒక నిమిషం సేపు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత చేతికి నెయ్యి రాసుకుని బియ్యప్పిండిని మృదువుగా వచ్చే వరకు మర్దనా చేయాలి.
ఒక పెనంలో కొద్దిగా నీరు పోసి సన్నమంట పెట్టి బెల్లం తురుము వేయాలి. బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. మొత్తం ఉడికి దగ్గరగా అయిన తర్వాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.
ఇప్పుడు పసుపు ఆకు లేదా అరటి ఆకు తీసుకుని బియ్యప్పిండి మిశ్రమాన్ని చిన్న బత్తాయి సైజులో తీసుకుని ఆకు మీద వేసి తడి అరచేత్తో వత్తాలి.
మధ్యలో చెంచా బెల్లం, కొబ్బరి మిశ్రమం పెట్టి ఆకుతోనే మెల్లగా సగానికి మడత పెట్టాలి. అంచులు విడిపోకుండా పిండిని వత్తాలి.
అంతా ఇలాగే చేసుకుని వాటిని స్టీమర్ లేదా ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి. చల్లారిన తర్వాత ఆకును తీసేసి వడ్డించాలి.
No comments:
Post a Comment