శేవల పాయసం
గోధుమ పిండి - 200 గ్రా బెల్లం తురుము - 250 గ్రా పాలు- పావు లీటరు ఏలకుల పొడి - ఒక టీ స్పూన్ నెయ్యి- 5 టీ స్పూన్లు కొబ్బరి తురుము- ఒక టేబుల్ స్పూన్ గసగసాలు- ఒక టీ స్పూన్
గోధుమపిండిని చపాతీకోసం తడిపినట్లు తడపాలి. ఒక గంట సేపటి తర్వాత పిండిని అరచేతిలో వేసి రుద్దుతూ పొడవు తీగలుగా చేసి అరగంట సేపు ఆరబెట్టాలి. వీటిని శేవలు అంటారు.
వాటిని కుకర్‌లో రెండింతలు నీటిని పోసి, ఒక చెంచాడు నెయ్యి వేసి ఉడికించాలి. నెయ్యి వేయడం వల్ల శేవలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి.
ఒక మోస్తరుగా ఉడికిన శేవలలో బెల్లం తురుము, వేడి పాలు వేసి గిన్నె అడుగు అంటుకోకుండా కలియబెడుతూ మరికొంత సేపు ఉడకనివ్వాలి.
శేవలు మెత్తబడి, మిశ్రమం దగ్గరగా అయిన తరవాత ఏలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపాలి. చివరగా కొబ్బరి తురుము, గసగసాలు చల్లాలి. ఇష్టమైతే జీడిపప్పు, బాదం కూడా వేసుకోవచ్చు.
No comments:
Post a Comment