క్యారెట్ దోశ
బియ్యం- రెండు కప్పులు మినప్పప్పు- రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము- రెండు కప్పులు పచ్చిమిర్చి- ఆరు నువ్వులు- ఒక టీ స్పూను ఉప్పు- తగినంత నెయ్యి లేదా నూనె- సరిపడా.
బియ్యం, మినప్పప్పులను 3 గంటల సేపు నానబెట్టి ముందు రోజు రాత్రే కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి పచ్చిమిర్చిని వేగించాలి. వాటిని క్యారెట్ తురుములో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఈ మిశ్రమాన్ని దోశల పిండిలో వేసి బాగా కలుపుకుని దోశలు వేసుకోవాలి. పైన నువ్వులు జల్లి రెండు వైపులా కాల్చుకుంటే చూడ్డానికి ఎరుపు రంగులో, తినడానికి కూడా చాలా బాగుంటాయి.
No comments:
Post a Comment