VTStyles

Recent Post

Sunday, 13 November 2016

Pulav - Parsy Royyala Kichidi

రొయ్యల కిచిడీ


శుభ్రం చేసి కారం ఉప్పు పట్టించిన రొయ్యలు - కప్పు పసుపు - అరచెంచా సాంబార్‌ పొడి - చెంచా పచ్చిమిర్చి తరుగు - చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా ఉప్పు - తగినంత కరివేపాకు రెబ్బలు - రెండు టొమాటో బంగాళాదుంప - ఒక్కోటి చొప్పున కొబ్బరితురుము - రెండు చెంచాలు ఉల్లిపాయలు - రెండు బియ్యం - రెండుకప్పులు నానబెట్టిన పెసరపప్పు - టేబుల్‌స్పూను మినప్పప్పు - టేబుల్‌స్పూను(నానబెట్టుకోవాలి) నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు.

  • కుక్కర్‌ని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఉల్లిపాయముక్కలు వేయించాలి. అవి వేగాక పచ్చిమిర్చి తరుగూ, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ, కొబ్బరితురుమూ, బంగాళాదుంప ముక్కలూ, రొయ్యలు వేయాలి.

  • రొయ్యలు కొద్దిగా వేగాయనుకున్నాక కడిగిన బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, తగినంత ఉప్పూ, పసుపూ, సాంబార్‌పొడి, నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. మూడు కూతలు వచ్చాక దింపేస్తే చాలు.

No comments:

Post a Comment