VTStyles

Recent Post

Sunday, 13 November 2016

Pulav - Meal Maker Pulav

మీల్‌‌మేకర్ పులావ్


బాస్మతి బియ్యం- ఒకటిన్నర కప్పు మీల్‌ మేకర్‌- ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలు- రెండు పచ్చిమిర్చి- రెండు అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టీ స్పూను పసుపు- చిటికెడు కారం- ఒక టీ స్పూను పుదీనా- రెండు టీ స్పూన్లు కొత్తిమీర- రెండు టీ స్పూన్లు బిర్యానీ ఆకు- ఒకటి యాలకులు- రెండు లవంగాలు- రెండు దాల్చినచెక్క- అంగుళం ముక్క నూనె లేదా నెయ్యి- ఒక టేబుల్‌ స్పూను ఉప్పు- తగినంత నీళ్లు- తగినన్ని

మసాలా కోసం

సోంపు- ఒక టీ స్పూను యాలకులు- మూడు లవంగాలు- మూడు దాల్చినచెక్క- చిన్న ముక్క.

  • బాస్మతి బియ్యాన్ని కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే వేడినీటిలో మీల్‌ మేకర్‌, కొద్దిగా ఉప్పు వేసి 10 నిమిషాలు నానబెట్టాలి.

  • ఒక బాణలిలో సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేగించి మసాలా పొడి చేసుకొని పెట్టుకోవాలి.

  • నీరు మొత్తం పోయేలా మీల్‌మేకర్‌ను చేతులతో పిండాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, మసాలా వేసి కలిపిపెట్టుకోవాలి.

  • ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేగించాలి.

  • ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, మీల్‌ మేకర్‌ వేసి మూతపెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి

  • ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, బాస్మతి బియ్యం వేసి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడకబెట్టాలి. వేడివేడిగా తింటే బాగుంటుంది.

No comments:

Post a Comment