VTStyles

Recent Post

Sunday, 13 November 2016

Pulav - Kadambam

కదంబం


బాస్మతి బియ్యం - రెండు కప్పులు క్యారట్, బీన్స్, పచ్చి బఠాణీ, క్యాప్సికమ్, ఉల్లికాడలు, ఉల్లిపాయలు, బంగాళదుంప, మెంతి కూర, పుదీనా - అన్నీ కలిపి ఒక కప్పు పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను ఏలకులు - 2 లవంగాలు - 2 దాల్చినచెక్క - చిన్న ముక్క కరివేపాకు - 2 రెమ్మలు కొత్తిమీర - చిన్న కట్ట ఉప్పు - తగినంత నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు - గుప్పెడు కిస్‌మిస్ - టేబుల్ స్పూను దానిమ్మ గింజలు - టేబుల్ స్పూను

  • ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉడికించి పక్కన ఉంచాలి. బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క వరుసగా వేసి కొద్దిగా వేయించాలి.

  • తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసేయాలి. ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి విడివిడిలాడేలా చేయాలి.

  • కూర ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. జీడిపప్పు, కిస్‌మిస్, దానిమ్మ గింజలు జత చేసి బాగా కలపాలి.

  • కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.

No comments:

Post a Comment