పచ్చి శనగల పలావ్
బాస్మతి బియ్యం- ఒక కప్పు పచ్చిశనగలు- అర కప్పు పుదీనా ఆకులు- పన్నెండు ఉల్లిపాయ- ఒకటి టమోటాలు- రెండు ఆలుగడ్డ- ఒకటి బిర్యానీ మసాలా- రెండు టీ స్పూన్లు కారం- ఒక టీ స్పూను పసుపు- చిటికెడు నూనె- ఒక టేబుల్ స్పూను నెయ్యి- ఒక టీ స్పూను నీళ్లు- తగినన్ని ఉప్పు- తగినంత. కొత్తిమీర- చిన్న కట్ట.
బాస్మతి బియ్యాన్ని కడిగి, నానబెట్ట్టుకోవాలి. కుక్కర్‌లో నూనె వేసి కాగాక, నెయ్యి కూడా వేసి వేడెక్కాక తరిగిన పుదీనా ఆకులు వేసి వేగించాలి.
తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేదాకా వేగనివ్వాలి. టమోట ముక్కలు కూడా వేసి ఉడికించాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగించాలి.
. శనగలను కూడా వేసి కలిపి, బాస్మతి బియ్యాన్ని నీటితో సహా వేసి బాగా కలపాలి. బిర్యానీ మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత కొత్తమీరతో అలకరించి వడ్డించండి.
No comments:
Post a Comment