తాటి ముంజల రోజ్ సిరప్ |
లేత తాటిముంజలు - 4 కాచి చల్లార్చిన పాలు - 3 కప్పులు రోజ్ సిరప్ (మార్కెట్లో దొరుకుతుంది) - 4 టేబుల్ స్పూన్లు.
ముంజల పై తొక్క తీయాలి. రెండు ముంజల్ని చిన్న చిన్నముక్కలుగా కట్ చేసి ఒక స్పూను రోజ్ సిరప్, ఒక స్పూను పాలలో కలిపి పక్కనుంచాలి.
మిగతా రెండు ముంజల్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గుజ్జులో మిగిలిన పాలు, రోజ్ సిరప్ కలిపి బాగా చల్లబడేవరకు ఫ్రిజ్‌లో పెట్టాలి.
సర్వ్ చేసేముందు రోజ్ సిరప్‌తో కలిపి పక్కనుంచిన ముంజ ముక్కల్ని పైన వేయాలి. పంచదార విడిగా వేయరాదు. రోజ్ సిరప్ స్వీట్‌గా ఉంటుంది.
No comments:
Post a Comment