పెసర బర్ఫీ |
పెసరపప్పు - పావుకేజి పంచదార - పావుకేజి నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు గసగసాలు - 2 టీ స్పూన్లు యాలకుల పొడి - అర టీ స్పూను ఎండుకొబ్బరి కోరు - 2 టీ స్పూన్లు జీడిపప్పులు - 10.
పెసరపప్పు 4 గంటలు నానబెట్టి నీరు వడకట్టి, పంచదారతో పాటు మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని (పలచగా) ఇడ్లీ కుక్కర్లో ఉడికించి, తీసి చల్లార్చి మనకిష్టమైన ఆకారాల్లో కట్ చేసుకోవాలి.
తర్వాత పెనంపై నెయ్యి రాసి రెండు వైపులా వేగించి గసగసాలు, యాలకులపొడి, ఎండుకొబ్బరి చల్లి జీడిపప్పుతో అలంకరించుకోవాలి.
No comments:
Post a Comment