సగ్గుబియ్యం హల్వా |
సగ్గుబియ్యం - 1 కప్పు పంచదార - 1 కప్పు నెయ్యి - అర కప్పు కిస్‌మిస్ -10 జీడిపప్పు - 10 యాలకుల పొడి - అర టీ స్పూను పచ్చకర్పూరం + కుంకుమపువ్వు - కొద్దికొద్దిగా.
సగ్గుబియ్యాన్ని కొంత నీరు పోసి పది నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత స్టౌవ్ మీద పెట్టి లోపలి తెల్లని పిండి పదార్థం కన్పించనంత వరకూ ఉడికించాలి.
తర్వాత పంచదార వేసి తిప్పాలి. పంచదార కరిగి సగ్గుబియ్యంతో కలిసి ముద్దలా అయ్యక నెయ్యి వేసి అడుగంటకుండా కొద్దిసేపు కలయబెట్టాలి.
ఇప్పుడు యాలకులపొడి, కిస్‌మిస్, జీడిపప్పు వేసి దించేసి పచ్చకర్పూరం, కుంకుమపువ్వు వేసి పదినిమిషాలు మూతపెట్టి తర్వాత తినాలి.
No comments:
Post a Comment