అరటికాయ ఉల్లి మసాలా |
అరటికాయ - 1 (తొక్క తీసి ముక్కలు కోసుకోవాలి) ఉల్లిపాయ - 1 (ముక్కలు కోసుకోవాలి) అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూను టొమాటో - 1 పచ్చిమిర్చి - 1 ఉప్పు - తగినంత నూనె - 5 స్పూన్లు జీలకర్ర - అర టీస్పూను కరివేపాకు - 1 రెమ్మఉల్లి మసాలా - 1 టీస్పూను
పాన్‌లో నూనె పోసి తరిగిన అరటికాయ ముక్కలు వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు వేగాక తీసి పక్కనుంచాలి.
బాండ్లీలో 1 టీస్పూను నూనెను ఉంచి జీలకర్ర, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించి కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
తర్వాత ఉప్పు వేసి కలిపి టొమాటో ముక్కలు కూడా వేయాలి. తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టాలి. టొమాటోలు మెత్తబడ్డాక ఉల్లి మసాలా వేసి ముందుగా వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేయాలి.
చిన్న మంట మీద కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత పైపైన కొత్తిమీర చల్లి వడ్డించాలి.
No comments:
Post a Comment