బెంగుళూరు వంకాయ పచ్చికొబ్బరి కూర |
బెంగుళూరు వంకాయలు - 2 పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు పచ్చిమిర్చి+ అల్లం పేస్టు - 1 టీ స్పూను కరివేపాకు - 4 రెబ్బలు ఉప్పు - రుచికి తగినంత నూనె - 1 టేబుల్ స్పూను పసుపు - చిటికెడు ఆవాలు+జీలకర్ర+మినప్పప్పు - 1 టీ స్పూను కొత్తిమీర తురుము - 1 టేబుల్ స్పూను.
బెంగుళూరు వంకాయల పై తొక్క, లోపలి జీడి తీసి కడిగి సన్నని ముక్కలుగా తరగాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, అల్లం, మిర్చి పేస్టు, పసుపు వేగించాలి.
తర్వాత తరిగిన ముక్కలు వేసి సన్నని మంటపై మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలపాలి. 5 నిమిషాలయ్యాక కొత్తిమీర తురుము వేసి దించేయాలి.
ఈ కూర అన్నంతో పాటు పరాటాల్లోకి కూడా బాగుంటుంది.
No comments:
Post a Comment