VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Bhindi Bengal Curry

బెండకాయ బెంగాలీ కర్రీ


బెండకాయలు - పావు కిలో పచ్చిమిర్చి - 1 మెంతులు సోంపు ఆవాలు వాము జీలకర్ర - పావు టీ స్పూను చొప్పున ఆవనూనె - 1 టేబుల్‌ స్పూను ఉప్పు - రుచికి తగినంత పంచదార - చిటికెడు అల్లం పొడి - అర టీ స్పూను.

  • బెండకాయల్ని అర అంగుళం ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి, మంట స్విమ్‌ చేసి మెంతులు, సోంపు, ఆవాలు, వాము, జీలకర్ర వేగించాలి.

  • తర్వాత తరిగిన బెండకాయలు, మిర్చి, ఉప్పు వేసి, రెండు నిమిషాల తర్వాత పసుపు, అల్లం పొడి కలిపాలి.

  • 5 నిమిషాలయ్యాక కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టి మగ్గనివ్వాలి. దించేముందు పంచదార చిలకరించాలి.

  • కమ్మటి వాసనతో ఉండే ఈ కూర బెంగాలీ వంటకం.

No comments:

Post a Comment